తొలిప్రేమ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ హీరోగా నటించే మూడో సినిమాకు రంగం సిద్ధమవుతుంది. అఖిల్, హలో సినిమాలతో పెద్దగా సంతృప్తి చెందని అఖిల్ మూడో సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే తాజాగాతొలిప్రేమ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇటీవలే వీరి మధ్య కథా చర్చలు జరిగాయని, కథను అటు నాగార్జున కూడా విని ఓకే చేయడంతో అఖిల్ ప్రొసీడ్ అవ్వమని చెప్పాడట. దాంతో దర్శకుడు వెంకీ ప్రస్తుతం స్క్రిప్ట్ విషయంలో బిజీగా మారాడు. ఇక అఖిల్ అటు కొరటాల శివ దర్శకత్వంలో కూడా నటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి మరి. కొరటాల శివ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదని అఖిల్ మూడో సినిమా మాత్రం తప్పకుండా వెంకీ అట్లూరితో ఉంటుందని టాక్.