గీతాంజలి 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు స్వీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉంది. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అంజలి, శ్రీనివాస్‌రెడ్డి ఈ సినిమాలో నటించబోతున్నారు. రాజు కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలికి కొనసాగింపుగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అంజలికి గీతాంజలి సినిమా మంచిపేరు తెచ్చి పెట్టింది. అదే తరహాలో ఈ సినిమా ఉండబోతోందో చూద్దాం.