గ్యాంగ్‌వార్ నేపథ్యం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళ, క్రిమినల్స్ వంటి భిన్నమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మరో విభిన్నమైన చిత్రం ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజు రాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శర్మ చుక్క నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ఈనెల 20 నుంచి జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత శర్మ చుక్క మాట్లాడుతూ- ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ పూర్తయింది. రెండు గ్యాంగ్‌లమధ్య జరిగే వార్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి వెపన్ అనే టైటిల్ పెట్టాం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:అనిల్.పి, రచన, సహకారం:నరేష్ ధ్యాన్, నిర్మాత:శర్మ చుక్క, దర్శకత్వం:ఆర్.ఎస్.సురేష్.