కాలచక్రంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియమణి టైటిల్ పాత్రలో శ్రీ శంఖు చక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల, ఎ.హితేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అంగుళీక’. ప్రేమ్ ఆర్యన్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. దీపక్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి, కథ గురించి నాకు మొదటినుంచి తెలుసు. నిర్మాతలు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారు. టీజర్ చాలా బాగుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటినీ తట్టుకుంటూ నిర్మాతలు ఇంతవరకూ తీసుకొచ్చారు. దర్శకుడిగా అండగా నిలబడ్డారు. టీజర్ టైమింగ్, కటింగ్ చూశాక దర్శకుడు సినిమా అద్భుతంగా తీసుంటారని అర్ధమైంది. నిర్మాతలిద్దరూ నాకు కావాల్సిన వారు. సినిమా పట్ల ఎంతో పాషన్‌తో ఉన్నారు. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న నిర్మాతలకు మంచి లాభాలు, దర్శకుడికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ... ‘సూర్యగ్రహణం, కాలచక్రంతో కూడుకున్న కథాంశం ఇది. దర్శకుడు చాలా కాలం ఈ స్క్రిప్ట్‌పై వర్క్‌చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రాఫిక్స్‌వర్క్ జరుగుతోంది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. కోడి రామకృష్ణగారి చేతులమీదుగా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ప్రేమ్‌ఆర్యన్ మాట్లాడుతూ... ‘‘కోడి రామకృష్ణగారి ఇన్స్‌పిరేషన్‌తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. వారి చేతుల మీదుగా కానె్సప్ట్ టీజర్ లాంచ్ జరగడం హ్యాపీగా ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మా నిర్మాత అన్నింటినీ అధిగమిస్తూ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి సహకరించారు. కాలచక్రంతో ముడిపడిన ఇద్దరు ప్రేమికుల వీరగాథ ఈ చిత్రం. అంగుళీకగా టైటిల్ పాత్రలో ప్రియమణి అద్భుతంగా నటించారు. కాలచక్రం, సూర్యగ్రహణం ఈ రెండు అంశాల చుట్టూ సినిమా తిరుగుతుంది. సూర్యగ్రహణం ఘడియల్లో విడిపోయిన ప్రేమజంట మళ్లీ సూర్యుడి ఆశీస్సులతో 585 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. అదే సమయంలో పగతో రగిలిపోతున్న దుష్టాత్మ ఆ జంటపై పగ తీర్చుకుందా? ఆ ప్రేమ జంట ఆత్మలకు ఎలా మోక్షం కలిగింది అనేది సినిమాకు హైలెట్‌గా ఉంటుంది’ అన్నారు.