సీనియర్ నటుడు వంకాయల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు చిత్రాల్లో నటించి, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ (78) సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. సినిమాలతోపాటు పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన ఆయన సీతామహాలక్ష్మి, సూత్రధారులు, అత్తవారిల్లు, శ్రీనివాస కళ్యాణం, ఊరికిచ్చిన మాట, శుభలేఖ, విజేత, శ్రుతిలయలు వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా వంకాయల జూవెలర్స్ పేరుతో వైజాగ్‌లో ఆయన నగల షాపును కూడా నిర్వహిస్తున్నారు. 1940లో వైజాగ్‌లో జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. బి.కామ్ వరకు చదువుకున్న ఆయన సినిమాలపట్ల వున్న ఆసక్తితో మద్రాస్‌లో ప్రయత్నాలు ప్రారంభించి నటుడిగా ఎదిగారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది.