సేవా సామ్రాజ్యంగా మనం సైతం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం రోజురోజుకూ తన సేవాసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. మనసున్న ఎంతోమంది మనం సైతంలో భాగమవుతున్నారు. తమకు వీలైనంత విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు మనం సైతంను ఆశ్రయిస్తున్న ఆపన్నుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. వాటిలో అత్యవసరంలో ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తోంది మనం సైతం. అలాంటి కొంతమందికి శనివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, శ్రీ మిత్రాచౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డ్రైవర్ యూనియన్ రాజు, లైట్‌మెన్ కూతురు అనూజ, నటుడు ధమ్ కొడుకు బాబు, దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఉదయ్‌కాంత్ తదితర పది మందికి చెక్‌లు అందజేశారు.అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. మనల్ని మనం గౌరవంగా భావించుకున్నప్పుడే సాటివారినీ గౌరవిస్తాం. చిత్ర పరిశ్రమలో నాకు కష్టాలు ఉన్నాయని ఎవరూ చెప్పుకోరు. అలా చెప్పుకుంటే అవకాశాలు ఇవ్వరు, దగ్గరకు రానీయరు అనే అపోహ ఉంది. అయితే నేను నా జీవితంలోని కష్టాలను పరిశ్రమలోని వాళ్లతో పంచుకున్నాను. వాళ్లు నన్ను దూరం పెట్టకుండా ఆదరించారు. అప్పుడే అనిపించింది ఈ భావన తప్పని. మనకున్న బాధలను చెప్పుకోవడంలో తప్పులేదు. ఇవాళ మనం సైతం ఇంతింతై విస్తరిస్తోంది. ఎంతోమంది కొత్తగా సేవాభావం ఉన్నవాళ్లు భాగస్వామ్యులు అవుతున్నారు. చిరంజీవిగారితో సహా పెద్దలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ వినాయక్‌గారు, కళ్యాణ్‌గారు లాంటివాళ్లు మా సంస్థను దీవించడానికి వచ్చారు. వాళ్లకు కృతజ్ఞతలు అన్నారు. దర్శకులు వి.వి వినాయక్ మాట్లాడుతూ... మనంసైతం కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కాదంబరి కిరణ్‌కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప కార్యక్రమం. మనం సైతం సేవను కిరణ్ తన జీవితంలో భాగం చేసుకున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్ల గురించి మాట్లాడుతుంటే ఆయన కళ్లలో నీళ్లు వస్తున్నాయి. అంతగా ఇతరుల బాధను పంచుకోవడం అద్భుతం. నా వంతుగా మనం సైతంకు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నాను. ఇలాంటి సంస్థల్లో రాజకీయాలు చేరకుండా గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా.