పాటల్లో ‘అనువంశికత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్‌రాజ్, నేహాదేశ్‌పాండే జంటగా కౌండిన్య మూవీస్ పతాకంపై రమేష్ ముక్కెర దర్శకత్వంలో తాళ్లపెల్లి దామోదర్‌గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అనువంశికత’. జెనిటిక్ లవ్‌స్టోరీ అనేది ఉప శీర్షిక. అశ్విత, క్రాంతికుమార్ సమర్పకులు. సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ‘రక్త సంబంధీకులను పెళ్లిచేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు చక్కగా సినిమా చేశాడు. మంచి సందేశాత్మక చిత్రమిది. పాటల్లోకూడా మంచి సందేశం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని మళ్లీరీ షూట్ కూడా చేశారు. అంటే దర్శక నిర్మాతలకు సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉందో అర్ధమవుతోంది. బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుంది’అని అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, ‘సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడి దామోదర్ సినిమా చేశారు. పాటలు బాగున్నాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’అని అన్నారు. చిత్ర దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ.. ‘ఈ బ్యానర్‌లో తొలి సినిమా ఇది. సినిమాకోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. నిర్మాత నేను అడిగిందల్లా కాదనకుండా సమకూర్చారు. అందువల్లే ఇంత మంచి అవుట్‌పుట్ తీసుకురాగలిగాను. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయి’ అని అన్నారు.