దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్.శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన దర్శకుల సంఘం ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్.శంకర్‌తోపాటు ఆయన పానెల్ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి.రాంప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాధ్, ఉపాధ్యక్షుడిగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, ఎస్.వి.్భస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పట్టా రంగారావు, ఎం.ఎన్.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.వి.రాజు, ఎన్.గోపీచంద్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్ అడ్డాల, అనీల్ రావిపూడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌రెడ్డి, కృష్ణమోహన్, కృష్ణబాబు, చంద్రకాంత్‌రెడ్డి విజయం సాధించారు. ఈ నూతన కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ- మంచికీ చెడుకీ మధ్య జరిగిన పోరాటంలో దర్శకుల సంఘాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్నదే నా కోరిక. నాకు సపోర్టుచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రెండేళ్ల సమయంలో డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతిష్ఠను దేశ స్థాయిలో తలమానికంగా తీసుకొస్తా అన్నారు.