పాటల్లో ఊ..పె.. కు..హ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, సాక్షీ చౌదరి జంటగా నిధి ప్రసాద్ దర్శకత్వంలో జె.బి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన ‘ఊ..పె..కు..హ’ (ఊళ్ళో పెళ్లికి కుక్కుల హడావుడి) చిత్రానికి సంబంధించిన పాటలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత జెమిని కిరణ్ సీడీని విడుదల చేశారు. అనంతరం దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ- అనూప్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. తను ఈమధ్య పెద్ద సంగీత దర్శకుడిగా మారిపోయాడు. అనుకున్న సమయానికి పాటలు ఇచ్చాడు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ- నిధి ప్రసాద్ చేసిన ఇంతకుముందు సినిమాకు నేను కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశాను. అప్పటినుంచి ఆయనతో మంచి పరిచయం వుంది. ఆయనతో పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- నేను రాజ్‌కోటితో కలిసి పనిచేసినపుడు దిలీప్ అనే కీబోర్డు ప్లేయర్ వుండేవాడు. ఆ తరువాత ఆయన రెహమాన్ అయ్యాడు. ఇపుడు అనూప్ కూడా కీబోర్డు నుంచి మంచి సంగీత దర్శకుడిగా ఎదిగాడు. పాటలు వింటే అతని టాలెంట్ అర్థమవుతుంది. నిధి ప్రసాద్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయనతో నా జర్నీ కొనసాగుతూనే వుంటుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అనూప్, సాక్షీ చౌదరి, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.