ఫస్ట్‌లుక్ వస్తోంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్‌చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరిగారు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలుపుతూ... దాదాపు 60% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే చివరివారంలో విడుదల చేయాలని ప్లాన్‌చేస్తున్నాం. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మకడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖావాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.