అనాథలే ఉండకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగస్థలం’ పాటలకు వస్తున్న స్పందనకు ఉబ్బితబ్బిబ్బు అవుతున్న చంద్రబోస్ ఆనందం రెట్టింపుచేస్తూ... ‘సత్య గ్యాంగ్’ చిత్రానికి చంద్రబోస్ రాసిన పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబోస్ స్వయంగా మీడియాతో పంచుకున్నారు. ‘సత్యగ్యాంగ్’లో అనాధలపై రాసిన పాటకు అనూహ్యమైన స్పందన వస్తోందని.. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తోందని చంద్రబోస్ అన్నారు. సాత్విక్ ఈశ్వర్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త మహేష్‌ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. ఈ చిత్రం త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గీత రచయిత చంద్రబోస్, హీరో సాత్విక్ ఈశ్వర్, హీరోయిన్ అక్షిత, ఛాయాగ్రాహకులు అడుసుమిల్లి విజయ్‌కుమార్‌లతోపాటు ప్రముఖ దర్శకులు సముద్ర పాల్గొన్నారు. సముద్ర మాట్లాడుతూ.. ‘చిత్ర నిర్మాత మహేష్‌ఖన్నా నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇటీవలే ఆయన తన తండ్రి జ్ఞాపకార్థం కోటిన్నర విలువచేసే స్థలాన్ని దానం చేశారు. అంత మంచి వ్యక్తి నిర్మించిన ‘సత్య గ్యాంగ్’ సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మహేష్‌ఖన్నా మాట్లాడుతూ.. సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రం ‘సత్య గ్యాంగ్’. హీరోగా పరిచయమవుతున్న సాత్విక్ ఈశ్వర్‌కి చాలా మంచి భవిష్యత్ ఉంది సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి నచ్చలేదన్న వారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. డబ్బులు ఎక్కువై కాదు ఇలా చెబుతున్నది. సినిమాపై మాకున్న నమ్మకంవల్ల. ఇక సముద్రగారు చెప్పినట్లుగా నేను కోటిన్నర ఖరీదు చేసే స్థలాన్ని మా నాన్నగారి జ్ఞాపకార్థం, మా అబ్బాయి హీరోగా నటించిన సినిమా విడుదలవుతున్న సందర్భంగా దానం ఇవ్వడం జరిగింది.