20వ కళాసుధ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 20వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నయ్‌లో పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20 మంది అవార్డు గ్రహీతలకు వెండి కిరీట ధారణ చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధప్రసాద్, వరప్రసాద్‌రెడ్డి, ఎ.ఎమ్.రత్నం, రామ్మోహన్‌రావు లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు. ఫణిమాధవ్ మాట్లాడుతూ కళాసుధ 20వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమం త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతోపాటు మహిళారత్న పురస్కారాలు అందజేయనున్నాం. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డును సాయికుమార్‌కు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి మాధవికి అందజేయనున్నాం అన్నారు. శ్రీనివాస్, నిర్మాత కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు: ఉత్తమ చిత్రం- శతమానం భవతి, ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం- ఓం నమో వేంకటేశాయ, ఉత్తమ సామాజిక చిత్రం- నేనే రాజు నేనే మంత్రి, ఉత్తమ హీరో- రానా, ఉత్తమ దర్శకుడు- క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి), ఉత్తమ నటి- కాజల్, ప్రత్యేక జ్యూరీ అవార్డు- విజయ్ దేవరకొండ, ఉత్తమ సంగీత దర్శకుడు- థమన్, ఉత్తమ కెమెరామెన్- ఛోటాకె.నాయుడు, ఉత్తమ నూతన నటుడు- ఘంటా రవితేజ్, ఉత్తమ నూతన నటీమణులు- రితికాసింగ్, సాయిపల్లవి, షాలినీ పాండే, ఉత్తమ పాటల రచయిత- సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ నూతన దర్శకురాలు- సుధా కొంగర (గురు)