జె.డి చక్రవర్తి ఉగ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జె.డి. చక్రవర్తి హీరోగా అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో నక్షత్ర మీడియా పతాకంపై రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఉగ్రం. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జె.డి.చక్రవర్తి మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించే చిత్రం ఉగ్రం. జె.డి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు అమ్మ రాజశేఖర్ అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్, సంగీతానికి మంచి స్కోప్ ఉంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తియింది. ఉగాదికి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. అక్షిత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్‌నందం, బెనర్జీ, ఆర్‌పి, చమ్మక్‌చంద్ర, శ్రీరామ్‌చంద్ర, టార్జన్, సంపూర్ణేష్ బాబు, శాని, రాజుభయ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: జాన్‌భూషణ్, కెమెరా: అంజి, ముజీర్ మాలిక్, ఎడిటింగ్: ఎస్.శ్రీనివాస్, సహ నిర్మాత: బండి శివ, నిర్మాత: నక్షత్ర రాజశేఖర్, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.