సరికొత్తగా ఐతే 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్యశర్మ, నీరజ్, మృణాల్ కీలక పాత్రల్లో రాజ్‌మాదిరాజు దర్శకత్వంలో ఫర్మ్ 9 బ్యానర్‌పై కె.విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మించిన చిత్రం ఐతే 2.0. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజ్‌మాదిరాజు మాట్లాడుతూ.. సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనన్న అనుమానం వుండేది. కానీ ఇటీవలే యూనిట్‌తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళాం. అక్కడ మా యూనిట్‌కు వచ్చిన స్పందన చూసి చాలా షాకయ్యాం. దాంతో నమ్మకం ఏర్పడింది. ఒకే రకమైన కథలతో విసిగిన ప్రేక్షకులకు సరికొత్త తరహా సినిమాలు ఎంతో అవసరం. అచ్చంగా అలాంటి ప్రయత్నమిది. టెక్నో సీట్ హెడ్జింగ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈనెల 16న విడుదలవుతుంది అన్నారు. నిర్మాత విజయరామరాజు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా చేశాం. సాంకేతికతలో మనం ఎక్కడున్నామనేది తెలుపుతుంది. స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. అమెరికాలో 40 సెంటర్లలో విడుదలవుతుంది అన్నారు.