మెగాస్టార్ ముఖ్య అతిథిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతుంది. 18న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ- ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించిన ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్‌లోకి విడుదలైంది. విడుదలైన మూడు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18న ఆర్‌కె బీజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగానంద్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు సహకారంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరుపబోతున్నాం. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- ఈ రోజు మార్కెట్లో నేరుగా ‘రంగస్థలం’ ఆడియో విడుదలైంది. సినిమాలో ఇప్పటికే ‘ఎంత సక్కగున్నావే..’, ‘రంగ రంగ రంగస్థలనా..’, ‘రంగమ్మ మంగమ్మ’ అనే మూడు పాటలు విడుదలయ్యాయి. మరో రెండు పాటలను జ్యూక్ బాక్స్‌లో వినండి. అందులో ‘జిగేల్ రాణి ఐటెమ్ సాంగ్’, ‘ఆగట్టుకుంటావా? ఈగట్టుకుంటావా?’ అనే సాంగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ నెల 30న విడుదల చేస్తున్నాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ మోనిక 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. నేను ఆ సెట్ చూసి ఆశ్చర్యపోయాను. నేను 25-28 సంవత్సరాలు పల్లెటూర్లోనే పెరగడంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా చేయడంవల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్టు అయింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. సినిమాలో ‘రంగమ్మ మంగమ్మ’ అనే పాటలో ఉపయోగించిన గొల్లభామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఉద్దేశించింది కాదు. నిర్మాతలకు నచ్చడంతో ఐటెం సాంగ్ పెట్టాను అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ- నాకు రంగస్థలం సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సహకారం అందించిన రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు. నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ- మంచి సాహిత్యానికి మంచి సంగీతం కుదిరింది. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సీనియర్ నరేష్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం), దర్శకత్వం: సుకుమార్.