సెన్సార్‌లో ఎంఎల్‌ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్-కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎల్‌ఏ. మంచి లక్షణాలున్న అబ్బాయి ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా శుక్రవారం అన్ని పాటలను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఇవెంట్‌ను జరుపనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కళ్యాణ్‌రామ్ నటిస్తున్న ‘నా నువ్వే’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. దాంతోపాటు పవన్ సాధినేని దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.