నిఖిల్ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ సురభి, ఆ తరువాత హీరోయిన్‌గా పలు అవకాశాలతో తెలుగులోనే కాకుండా తమిళ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. నానితో చేసిన జెంటిల్‌మన్, అల్లు శిరీష్ చేసిన ఒక్కక్షణం సినిమాలు విజయాలు సాధించడంతో సురభికి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. గ్లామర్‌తోపాటు నటిగా కూడా మంచి పేరుతెచ్చుకున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. యువ హీరో నిఖిల్ సరసన హీరోయిన్‌గా ఎంపికైందట. తమిళ దర్శకుడు సంతోష్ తెరకెక్కించిన కణితన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం విద్యా వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపే అంశాలతో వుంటుందని, ఇందులో ఇనె్వస్టిగేటివ్ రిపోర్టర్‌గా నిఖిల్ కన్పిస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా మంచి గుర్తింపు వస్తుందని సమాచారం.

చిత్రం.. సురభి