23నుంచి రెండో షెడ్యూల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్‌ను ఈనెల 23 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్‌లోనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న బిగ్ బి అమితాబ్, నయనతారలు పాల్గొంటారట. అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరలో షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.