బాబోయ్ ఆప్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అంటేనే ఓ సంచలనం. సినిమాలోని పాత్రకోసం ఎంతకైనా తెగించేసేందుకు సిద్ధం అనే ప్రతిభగల అందాల భామలు చాలా అరుదుగా వుంటారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఏ తరహాగా అయినా నటించేందుకు రెడీ అనేసే రాధికా ఆప్టే.. పొదుపు కూడా పాటించేస్తోందిట. ఆ విషయం కూడా తనే చెప్పేస్తోంది. ఈవిడ భర్త పేరు బెనడిక్ట్ టేలర్.. యూకెలో ఓ మ్యుజీషియన్. తనేమో అక్కడే ఉంటాడు. ప్రొఫెషనల్‌గా బిజీ. ఈమెగారు ఇండియాలో ఇంకా ఎక్కువ బిజీ. నెలకో రెండుమార్లు లండన్ పోయి తన భర్తతో గడిపివస్తూ వుంటుంది. ఎంత సంపాదించేసినా నెలకు రెండుసార్లు లండన్‌కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ జర్నీ అంటే బిల్లు తడిసి మోపెడవుతుంది కదా! అయినా సరే.. తన భర్తని కలిసేందుకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని... అందుకే వీలైనంత పొదుపుగా వెచ్చిస్తానని అంటోంది రాధిక.