ఒక్క సినిమాకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. స్టార్ హీరోలతో సమానంగా కావాలని డిమాండ్ చేస్తున్నారు కూడా. దాదాపు మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఇపుడు రెండంకెల సంఖ్యలో నడుస్తోంది. హీరోయిన్స్ కూడా రెండు హిట్స్ అందుకునే సరికి లక్షల్లో నుంచి కోట్లలోకి జంప్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఓ బాలీవుడ్ భామ రెమ్యూనరేషన్‌లో అప్పుడే భారీ మార్పులు చేసింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘్భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తోన్న కైరా అద్వానీ సినిమా విడుదల కాకముందే క్రేజ్‌ను గట్టిగా అందుకుంటోంది. కనీసం ఈ భామ ఫస్టలుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయింది. రామ్‌చరణ్-బోయపాటి సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలమధ్య అమ్మడి రెమ్యూనరేషన్ వ్యత్యాసం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. భరత్ అనే నేను సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటే రామ్‌చరణ్ సినిమాకోసం ఏకంగా డబుల్ రేట్‌ను పెంచి ఫైనల్‌గా కోటి అనేసిందట. ఎందుకంటే భరత్ ప్రాజెక్ట్స్‌తో ఇప్పటికే భారీ ఆఫర్స్ వస్తున్నాయి. కానె్సప్ట్ నచ్చకపోవడంతో కొన్ని సినిమాలకు నో చెప్పిందట. బోయపాటి చెప్పిన కథలో ఆమె పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. అయితే రెమ్యూనరేషన్ విషయాన్ని ముందే చెప్పడంతో నిర్మాతలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.