గ్లామర్ డోస్ పెంచిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల చందమామ కాజల్ క్రేజ్ ఈమధ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత ఇప్పటిదాకా ఒక్క సినిమాలోనూ కనిపించడంలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఎంఎల్‌ఏ. నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన నటిస్తున్న కాజల్‌కు అటు కొత్త అవకాశాలు కూడా రావడంలేదు. దీనికి కారణం ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుస పరాజయాలు అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్న కాజల్ ఇంకాస్త స్లిమ్‌గా మారిందట. మారడమే కాదు.. ఎంఎల్‌ఏ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచేసిందట. ఈ దెబ్బతో మళ్లీ కాజల్ ఫామ్‌లోకి రావడం ఖాయమని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎంఎల్‌ఏ సినిమాలో కాజల్ గ్లామర్ షో ఓ రేంజ్‌లో ఉంటుందని టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. టీజర్‌లో కూడా కాజల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి కాజల్ క్రేజ్‌ని ఈ ఎంఎల్‌ఏ రిటర్న్ తెస్తారో చూడాలి.