దేశ ప్రతిష్టను పెంచిన చిఠుతేజ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత ఎన్.ఎస్.నాయక్ సహాయ సహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్‌కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్‌సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన బాలల చిత్రం చిరుతేజ్‌సింగ్. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధాన పాత్ర పోషించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొన్న చిరుతేజ్ సింగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తల్లి కూతురి మధ్య ప్రేమ, టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా రూపొందించబడినది. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాథ పిల్లలకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్‌లో వేయడం జరిగింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీమతి సమంత అక్కినేని తన అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ వీరశంకర్, అలాగే నిర్మాత శ్రీ రాజ్ కందుకూరి, దర్శకులు మధుర శ్రీ్ధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, యువ హీరో అభిజిత్, యువ దర్శకులు సాగర్ చంద్ర, యువ నటి సీత నారాయణ్‌తో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించడం జరిగింది. మనాలి రాథోడ్, సౌమ్య వేణుగోపాల్, చిరుతేజ్‌సింగ్, రాజశేఖర్, ఎన్.ఎస్.నాయక్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నిర్మాత: ఎన్.ఎస్.నాయక్చ్రన దర్శకత్వం: డా.ఆనంద్‌కుమార్, సహ నిర్మాత: మహేశ్ నునావత్, సంగీతం: గీతా పూనిక్, కెమెరా: జై, ఎడిటింగ్: యాదగిరి కంజర్ల.