పడేసావే ప్లాటినం డిస్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక్‌రాజు, నిత్యశెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై చునియా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు నాగార్జున ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సినిమా మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. జెన్యూన్‌గా సినిమా నచ్చి ప్రమోట్ చేయాలనుకున్నాను. ఏడెనిమిది నెలల క్రితం చునియా ఈ సినిమా కథ చెప్పి మా వెనుకే ఉండి సపోర్ట్ చేస్తారా? అని అడిగినపుడు నచ్చితే కచ్చితంగా ప్రమోట్ చేస్తానని చెప్పా. అందరూ ఇన్వాల్వ్ అయ్యి నటించారు. ఇది హిట్ అయితే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించినట్లు ఉంటుంది’- అని చెప్పారు. చునియా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలైంది. సినిమాను డైరెక్ట్ చేయాలనేదే నా కల. ఆ విషయంలో నాగార్జున ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ నెల 26న సినిమా రిలీజ్ అవుతుంది.’ అని తెలిపారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కార్యక్రమంలో నిత్య, కార్తిక్, సీనియర్ నరేష్, విశ్వ, కృష్ణుడు, కిరణ్, అనితాచౌదరి, అనంత్‌శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.