ఛల్ మోహన్ రంగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్‌లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు విడుదలవుతాయి. ఈ ఉగాది సందర్భంగా యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్‌తో కలసి నటించిన ‘్ఛల్ మోహన్ రంగ’ చిత్ర ఆల్బమ్‌ని విడుదలచేశారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకుముందు విడుదలైన మూడు పాటలు లాగానే ఆల్బమ్‌లో కొత్తగా విడుదలైన మిగతా మూడు పాటలు వివిధమైన శైలిలో ఉన్నాయి. ఆల్బమ్‌లో ప్రతీ పాటని కొత్తగా కొట్టడమే కాకుండా ప్రతీ పాటని హిట్ చేయగల అతి తక్కువ సంగీత దర్శకులలో ఒకరు థమన్. మాస్ నుంచి క్లాస్ వరకు, ప్రేమనుంచి విరహం వరకు, సంతోషం నుంచి బాధవరకు, అన్నింటిని ఎంతో బాగా స్వరపరిచిన ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ ఇచ్చారు. యు.ఎస్, ఊటీ, హైదరాబాద్‌లలో ఎన్నో అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎన్.నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్ వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ, సమర్పణ: శ్రీమతి నిఖితరెడ్డి, నిర్మాత: ఎన్.సుధాకర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణచైతన్య.