గౌతమ్ చిత్రంలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనదైన ఇమేజ్ స్వంతం చేసుకుంది అందాల భామ అనుష్క. స్టార్ హీరోలకు ధీటుగా బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ సృష్టించే అనుష్క మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా కూడా సత్తా చాటుకుంది. తాజాగా ‘్భగమతి’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈమె, ప్రస్తుతం స్లిమ్‌గా మారే పనిలో బిజీగా వుంది. అందుకే వచ్చిన అవకాశాలకు నో చెబుతూనే వుంది. తాజాగా అనుష్క గౌతమ్ మీనన్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట. దర్శకుడిగా, నిర్మాతగా గౌతమ్ మీనన్‌కు ప్రత్యేక గుర్తింపు వుంది. తాజాగా ఆయన అనుష్కతో చర్చలు జరిపి ఈ సినిమాకు అంగీకారం తీసుకున్నాడట. తెలుగుతోపాటు తమిళంలో విడుదలయ్యే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. అనుష్క స్లిమ్‌గా మారాక సినిమాలపై మళ్లీ ఫోకస్ పెడుతుందట. ఇక పెళ్లి గురించి అయితే ‘ఇప్పుడే అడక్కండి’ అని చెబుతోంది.