యధార్థ ఘటనల ‘మర్లపులి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధాకర్ ఇంపెక్స్ ఇండియా పతాకంపై డి.నరసింహ సమర్పణలో వరుణ్ సందేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మర్లపులి. డి.రామకృష్ణ దర్శకత్వంలో బి.సుధాకర్‌రెడ్డి, బి.్భవానీ శంకర్, ఖమ్మం శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైన సందర్భంగా హైదరాబాద్‌లో పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ- 1983లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో అందరూ పేరున్న నటీనటులే నటించారు. దర్శకుడు రామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా నేనే అందిస్తున్నానన్నారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ- కేవలం 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీతో తెరకెక్కించాం. నర్సాపూర్ ఫారెస్టులో చిత్రీకరణ జరిగింది. నిర్మాతలు ప్రతి విషయంలో ఎంతో సపోర్టు అందించారు.