మనసుకు దగ్గరైన ఎంఎల్‌ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ఎంఎల్‌ఏ. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ- కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే చాలా ఇష్టం. అలాంటివారిలో ఈ నిర్మాతలు ముందుంటారు. తప్పకుండా భవిష్యత్తులో పెద్ద నిర్మాతలవుతారు. పటాస్ కథ విన్నపుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో ఈ కథ కూడా అలాగే అన్పించింది. దర్శకుడు నన్ను కొత్తగా చూపిస్తున్నాడు. తప్పకుండా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా వుంటుంది. కాజల్‌తో నేను చేసిన రెండవ సినిమా ఇది. ఇది నా 14వ సినిమా. కానీ తను మాత్రం 50 సినిమాలు పూర్తిచేసింది. మంచి డెడికేషన్ వున్న నటి. ఈ సినిమా నా హృదయానికి బాగా దగ్గరైంది అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ- కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఎంఎల్‌ఏ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. పాటలు ట్రైలర్ బాగున్నాయి అన్నారు. నిర్మాత కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ- ఈ బ్యానర్‌లో ఇది మా రెండవ చిత్రం. ఉపేంద్ర కథ చెప్పినపుడు థ్రిల్లింగ్‌గా అనిపించింది. దాన్ని అంతకంటే బాగా తెరకెక్కించారు. కథ కళ్యాణ్‌రామ్‌కి కూడా బాగా నచ్చింది. ఇంత మంచి సినిమా చేసినందుకు నిర్మాతలుగా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈనెల 23న మా ఎంఎల్‌ఏ ప్రేక్షకుల్ని అలరిస్తాడు అన్నారు. దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ- కళ్యాణ్‌రామ్ ఇచ్చిన సపోర్టు మరువలేనిది. అలాగే నిర్మాతలు కూడా ప్రతి విషయంలో సపోర్టు అందించారు. మణిశర్మ సంగీతం హైలెట్‌గా నిలుస్తాయి.