రాజరథం వస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలి హిట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం రాజరథం. అంజు వల్లభనేని, విసు దకప్పదారి, సతీష్ శాస్ర్తీ, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 23న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సతీష్ మాట్లాడుతూ- అమెరికాలో డిస్ట్రిబ్యూటర్‌గా వుండి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించాం. ఆ బ్యానర్‌పై మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం. అనూప్ భండారి దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. ఈనెల 23న మీ ముందుకు వస్తున్నాం అన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ- బెస్ట్ క్వాలిటీస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా మాకు మంచి గుర్తింపు వస్తుంది అన్నారు. హీరో నిరూప్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంజనీరింగ్ విద్యార్థిగా కనపడతాను. రానా వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అలాగే ఆర్య ముఖ్యపాత్రలో నటించారు అన్నారు.