ప్లాన్ చేసినట్టు ఏదీ జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు దశాబ్దకాలంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కాజల్. గ్లామర్‌తోపాటు నటిగా కూడా సత్తా చాటిన కాజల్, సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన ఎంఎల్‌ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ కాజల్‌తో ఇంటర్వ్యూ...
* కళ్యాణ్‌రామ్‌తో నటించడం ఎలా ఉంది?
- దాదాపు పదేళ్ల క్రితం కళ్యాణ్‌రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యాను. మళ్లీ కలిసి నటించేందుకు ఇంతకాలం పట్టింది. తను చాలా మంచి వ్యక్తి. ఒకరకంగా పాత స్నేహితులం కలుసుకున్నట్టుంది.
* ఇందులో మీ పాత్ర?
- ఇందులో ఎన్‌ఆర్‌ఐ అమ్మాయిగా కన్పిస్తాను. చాలా ఇంటిలిజెంట్. అలాగే దృఢమైన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది.
* హీరోయిన్‌గా కెరీర్ ఎలా సాగుతోంది?
- చాలా ఆనందంగా ఉన్నాను. నచ్చిన చిత్రాలను ఎంచుకుంటూ నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావడం, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానించడం చూస్తుంటే గర్వంగా కూడా ఉంది.
* హీరోయిన్‌గా ఈ స్థాయిని ఊహించారా?
- లేదు. నిజానికి నా మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాను. ఆ సినిమా తరువాత మళ్లీ ఎంబిఏ చేద్దామని ఆ ఒక్క సినిమాతోనే ఆపేద్దాం అనుకున్నాను. లైఫ్ మనం అనుకున్నట్టు ప్లాన్ చేస్తే కుదరదు.
* ఇంతకీ ఎంఎల్‌ఏ ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు?
- ఇది మంచి సోషల్ మెసేజ్ కల్గిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా కళ్యాణ్‌రామ్ పాత్ర ఆకట్టుకుంటుంది.
* ఈమధ్య సినిమాలను ఒప్పుకోవడంలేదు, కారణం?
- ప్రత్యేక కారణాలంటూ ఏవీ లేవు. అయితే ఏ సినిమా విషయంలోనైనా నా పాత్ర కథ నచ్చితేనే చేస్తాను.
* ‘అ!’ సినిమా ఎలాంటి సంతృప్తినిచ్చింది?
- కథ చాలా భిన్నంగా సాగుతుంది. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. అందుకే ఆ పాత్ర చేశాను. చాలామంది బాగా చేశావు అంటూ అభినందించారు.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాను. దాం తోపాటు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో చేస్తున్నా!

శ్రీ