పెళ్లైపోయిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో దశాబ్దకాలంపాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా రష్యన్ యువకుడితో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈమె, పలుమార్లు మీడియా కంట పడడంతో నేరుగా ప్రేమ విషయం గురించి అడిగారు. కానీ ప్రేమా, గీమా లేదంటూ దాటవేస్తూ వస్తున్న శ్రీయ, ఈనెల 12న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నట్టు సమాచారం. ఈ వివాహం గురించి వార్తలు వచ్చినా కూడా రూమర్స్ అంటూ పుకార్లు పుట్టించారు. దాంతో చాలామందికి సందేహం కలిగింది. అసలు శ్రీయ వివాహం జరిగిందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా ఈనెల 19న శ్రీయ తన ఆత్మీయ బంధువులకు, స్నేహితులకు రిసెప్షన్‌ను ఇచ్చారట. దానికి సంబంధించిన ఫొటోలు బైటికి రావడంతో శ్రీయ వివాహం జరిగిపోయిందని నిర్థారణకు వచ్చారు. ఇంత రహస్యంగా ఆమె పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి రష్యన్ యువకుడు ఆండ్రి కొన్సివ్‌తో వివాహం జరిగిపోయింది.