నీది నాది ఒకే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు, సాత్నాటైటస్ జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో అరాన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ఈమధ్య కొత్త దర్శకుల ప్రభంజనం మొదలైంది. అదే కోవలో వేణు కూడా ఉంటాడని ఖచ్చితంగా చెబుతున్నాను. ట్రైలర్ బాగుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- నారా రోహిత్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నాడు. ఇండస్ట్రీకి నిర్మాతే ప్రాణం అని నమ్మే వ్యక్తిని నేను. ఆకలిరాజ్యం సినిమాలో తండ్రీకొడుకుల సీన్ మళ్లీ గుర్తుకొచ్చింది. ఈ సినిమా కూడా అందరికీ గుర్తుండిపోతుంది అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ- దర్శకుడు కథ చెప్పినపుడు ఇదేదో నా కథలాగే ఉందనిపించింది. ఎందుకంటే, ఇలాంటి కథలు మన జీవితాలకు దగ్గరగా ఉంటాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూసినవాళ్ళందరూ భలేగా ఉందని అంటున్నారు. చాలామంది సొసైటీకోసం బతుకుతున్నారు. అలా కాకుండా వారికోసం వారు బ్రతికినపుడే జీవితం మరోలా వుంటుంది. ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకోవాలి. అలా కాకపోతే ఇంకెవరూ నమ్మరు అని చెప్పే సినిమా ఇది అన్నారు.