‘హ్యాపీడేస్’ గుర్తొస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ఆనందం చిత్రాన్ని అదే పేరుతో సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత గురురాజ్ విడుదల చేస్తున్నారు. సీతారామరాజు సమర్పణలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నూతన నటీనటులతో పాటు మలయాళ స్టార్ నవీన్ పాలి అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత గురురాజ్ చెప్పిన విశేషాలు..మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఆనందం చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చూస్తే ప్రతి ఒక్కరికీ హ్యాపీడేస్ గుర్తొస్తుంది. కాలేజీ స్టూడెంట్స్ పిక్‌నిక్‌కు వెళ్లినపుడు చోటుచేసుకున్న మధురమైన సన్నివేశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా వుంటుంది. ముఖ్యంగా నితిన్ పాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది. సినిమాలో కథ నచ్చడంతో తెలుగు హక్కులు తీసుకున్నాం. మలయాళంలో కేవలం నాలుగు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 20 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఇక సినిమా విడుదల సమయంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. గత 20 ఏళ్ళుగా పరిశ్రమలో ఉంటున్నాను. మాకున్న ఇమేజ్ దృష్ట్యా మంచి థియేటర్లు దొరికాయి. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు హక్కులకోసం భారీ పోటీ ఏర్పడింది. భారీ రేటుకు మేము తెలుగు హక్కులు స్వంతం చేసుకున్నాం. నిజానికి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ ఒరిజినాలిటీ దెబ్బతింటుందని డబ్బింగ్ చేశాం.