‘2 స్టేట్స్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్య ప్రొడక్షన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘2స్టేట్స్’. చేతన్ భగత్ రాసిన నవల ‘2స్టేట్స్’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడివిశేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రెబల్‌స్టార్ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా ఎస్.ఎస్.రాజవౌళి క్లాప్ కొట్టారు. కె.రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఇంకా టి.సబ్బరామిరెడ్డి, కోడి రామకృష్ణ, వి.వి.వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘తెలుగులో చేస్తున్న ‘2స్టేట్స్’ చిత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. మా చిత్రం ప్రేక్షకులకు నచ్చేలా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కుతుంది’ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ ‘నేను హిందీలో వచ్చిన ‘2 స్టేట్స్’ సినిమా చూశాను. సంగీతానికి చాలా స్కోప్ ఉన్న చిత్రమిది. మంచి టీం కుదిరింది. ఎం.ఎల్.వి.సత్యనారాయణ వంటి ఫ్యాషనేట్ నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. దర్శకుడు వెంకట్ కుంచం మాట్లాడుతూ- ‘అడాఫ్ట్ చేసుకుని సినిమా చేయడం సులువుకాదు. ‘2స్టేట్స్’ సినిమా స్క్రీన్‌ప్లేపై చాలారోజులు వర్క్‌చేశాం. మధు శ్రీనివాస్, మిథున్‌చక్రవర్తి వంటి టీం సభ్యులు దొరికారు. అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మర్. శివానీ రాజశేఖర్‌ను మా చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. అనూప్ ఆల్‌రెడీ మూడు బ్యూటీఫుల్ ట్యూన్స్ అందించారు. సినిమాను మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తాం. మొదటి షెడ్యూల్‌ను ఏప్రిల్ 5నుండి 19వరకు హైదరాబాద్. మేలో రెండవ షెడ్యూల్‌ను కోల్‌కతాలో.. మూడో షెడ్యూల్‌ను యుఎస్‌లో ప్లాన్ చేశాం. మా యూనిట్‌ను ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ థాంక్స్’ అన్నారు. శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘నేను నటించడానికి అంగీకరించిన నా తల్లిదండ్రులకు థాంక్స్. ‘టు స్టేట్స్’ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ వెంకట్, రైటర్ చైతన్యలకు థాంక్స్. అనూప్‌గారు మా సినిమాకు మ్యూజిక్ ఇస్తుండటం ఆనందంగా ఉంది’ అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ- ‘దర్శకుడు వెంకట్ నాకు చాలా మంచి మిత్రుడు. ఎప్పటినుండో మంచి లవ్‌స్టోరీలో నటించాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో నా కోరిక తీరనుంది. హిందీలో ‘టు స్టేట్స్’ సినిమాను మూడుసార్లు చూశాను. చాలా బాగా నచ్చింది. శివానీతో నటించడం హ్యాపీ’ అన్నారు. అడివిశేష్, శివానీ రాజశేఖర్, రజత్‌కపూర్, భాగ్యశ్రీ, లిజి, ఆదిత్య మీనన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్, విద్యుల్లేఖా రామన్, హేమ, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్, కెమెరా: శానియల్ డియో, స్టంట్స్: రవివర్మ, కొరియోగ్రఫీ: జానీ.