వేసవికి ‘రాజుగాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. ‘రాజ్‌తరుణ్ మా బ్యానర్‌లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనారెడ్డి చాలాచక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. విడుదలైన టీజర్, పోస్టర్స్‌కి మంచి స్పందన లభించింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నాం. త్వరలోనే ఆడియోను విడుదలచేస్తాం. మా బ్యానర్‌లో ‘రాజుగాడు’ మరో హిట్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. రాజ్‌తరణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృథ్వీ, కృష్ణ్భగవాన్, సుబ్బరాజు, రాజారవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యూమ్, అదుర్స్ రఘు, అభి, ఫిష్‌వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీసుందర్, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనారెడ్డి.