వరుణ్ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ మొదటి చిత్రంతోనే ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్న మెహరీన్, గ్లామరే కాదు నటిగా కూడా నిరూపించుకుంది. తాజాగా వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైందట. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వెంకటేష్‌తోపాటు వరుణ్‌తేజ్ నటించే ఈ చిత్రానికి ఎఫ్ 2 (ఫన్‌టూ) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో వరుణ్ సరసన మెహరీన్ నటిస్తుండగా, వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మెహరీన్ గోపీచంద్, విజయ్ దేవరకొండ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.