గ్రాఫిక్స్ ప్రధానంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసల్ ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో శ్రీకృష్ణా శంకర ప్రొడక్షన్స్ పతాకంపై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘అరుంధతి అమావాస్య’. కె.విద్యారాణి సహ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు తోట కృష్ణ వివరాలు తెలియజేస్తూ- అరుంధతికీ, అఘోరాకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో ఓ పాము ముఖ్యపాత్ర పోషిస్తోంది. అమావాస్య రోజున ముగిసే కథతో ఆసక్తి కలిగించే అంశాలతో ఈ పోరాటంలో ఎన్నో మలుపులు వుంటాయి. గ్రాఫిక్స్ ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయి. హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. డిచ్‌పల్లిలో వున్న పది కోట్ల భారీ బంగళాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఆద్యంతం ఆసక్తికలిగించే ఈ కథలో కామెడీ ఎమోషన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి అన్నారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ- చిత్రీకరణ పూర్తయ్యింది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసి మొదటి కాపీ సిద్ధం చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్, ఎడిటింగ్: రంజిత్ కళ్యాణ్, కెమెరా: ఎం.ఎస్.గౌడ్, పాటలు: బాబ్జి, నిర్మాత: కె.కోటేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:తోట కృష్ణ.