ఫిలిం ఫెస్టివల్‌కు మెర్క్యురీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూకీ చిత్రం మెర్క్యురీ. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం, జయంతిలాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆప్ లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- మా మెర్క్యురీ చిత్రం ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్‌ఏంజిల్స్ వేడుకలో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆనందంగా వుంది. లాస్‌ఏంజిల్స్‌లో వున్న సినీ అభిమానులందరూ మా సినిమాను చూసేందుకు ఇదొక మంచి అవకాశం. విభిన్నమైన కథ, కథనాలతో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అని తెలిపారు. పెన్ స్టూడియోస్ మరియు స్టోన్‌బెంచ్ ఫిలింస్ సమర్పిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదలకు సిద్ధమైంది.