యదార్థ ఘటనల భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటి సీత ముఖ్య పాత్రలో కె.ఎం.ఆనంద్ దర్శకత్వంలో ఆర్.పిక్చర్స్ పతాకంపై సిహెచ్.రాంబాబు నిర్మిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇందులో సీనియర్ నటి సీత అమ్మవారిగా నటిస్తున్నారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇందులో 25 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. ఆంధ్ర, తమిళనాడులోని సేలం, మేచెరి తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. భారీ గ్రాఫిక్స్‌తో అత్యంత భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. నిర్మాత రాంబాబు మాట్లాడుతూ- కథ మీదనున్న నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. భద్రకాళి పాత్రలో సీత అద్భుతంగా నటిస్తోంది. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఆదేశ్ ఉత్రియన్ మంచి పాటలు ఇచ్చాడు. రెండో షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. సంధ్య, మనీష్, చలపతిరావు, రఘుబాబు, చిత్రం శ్రీను, జయవాణి, తా.రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అదేశ్ ఉత్రియన్, కెమెరా: విజయ్ తిరుమూలం, ఎడిటింగ్: వినయ్ రామ్, నిర్మాత: సిహెచ్.రాంబాబు, దర్శకత్వం: కె.ఎం.ఆనంద్.