సిన్మావాళ్ళు సిన్మా వాళ్ళే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్.. పోలీస్ హోతీ! న హిందూ పోలీస్.. న ముసల్మాన్ పోలీస్../ హిందు పోలీసులు.., ముస్లిమ్ పోలీసులు అని విడివిడిగా వుండరు. పోలీసులు అంటే పోలీస్‌లే...! అంటూ బిగ్గరగా అరుస్తూ అగ్గి రుద్రుడు అయ్యాడు. జవహర్‌లాల్ నెహ్రూజీ!- ఇప్పుడు కాదు ఎప్పుడో...! మన దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో...
స్వాతంత్య్ర సమరంలో.. హిందూ ముస్లింల్లో ఐక్యత కోరుతూ గాంధీగారు సత్యాగ్రహం చేస్తూ.. ఆరోగ్యం క్షీణించి.. ఆఖరి దశలో వుండగా.. ఆయన్ని చూడటానికి వచ్చారు తొలి భారత ప్రధాని శ్రీ జవహర్‌లాల్ నెహ్రూజీ. ఆ సమయంలో కొందరు ఉద్యమకారులు ఇలా అన్నారు. హిందూ పోలీసులను ముస్లిం పోలీసులు కొడుతున్నారు! ఇది న్యాయమా... అంటూ అరిచారు.
ఆ మాటలకి నెహ్రూజీకి చాలా కోపం వచ్చింది..! మేడ పైకి వెళ్తున్న అతను గబగబా మెట్లుదిగి - ఇలా అరిచారు...!
‘పోలీస్ అంటే పోలీస్! హిందూ పోలీస్... ముస్లిం పోలీస్ అని రెండు రకాలు...వుండరు...!’ అని గట్టిగా అరిచాడు... ఆయన
ఈ సంఘటన ఎందుకు గుర్తువచ్చింది అంటే.. ఇటీవల ఎవరో అన్నారు. ఆంధ్ర తారలు.. తెలంగాణ తారలు అంటూ ఫిలిం ఛాంబర్ గురించి ఏదో చెప్పారు! అప్పుడు అనిపించింది. తెలుగు సిన్మావాళ్ళు... హిందీ సిన్మావాళ్ళు... తమిళ సిన్మావాళ్ళు అని అంటారు కానీ తెలుగు మాట్లాడే నటీనటులు అందరు ఒక్కటే..
ఒక కులం... ఒక మతం... ఒక వర్గం లేని వాళ్ళు కళాకారులు! వాళ్ళలో సిన్మావాళ్ళు మంచినీళ్ళలాంటి వాళ్ళు..! పాలలో కలిసిపోతారు... మందులో కలసిపోతారు! ఇన్- తెలుగు సిన్మావాళ్ళు అంటే... ఆనాటి నాగయ్య...్భనుమతి.. సావిత్రి... ఎస్వీరంగారావు... కన్నాంబ.. వాళ్ళంతా తమిళనాడులో రాణించిన తెలుగువాళ్ళే! తెలుగు సిన్మారంగంలో యన్.టి.ఆర్... అక్కినేని వరుసలో మూడోవాడు కాంతారావు! తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో! అతను తెలంగాణ హీరో అనే సంగతి నిన్నమొన్నటివరకూ.. ఎవరికీ తెలీదు...
ఆంధ్రా హీరో- తెలంగాణ హీరో అని వేరుచేస్తూ మనం వాదించుకుంటే జనం నవ్వుతారు. ఈ విధంగా విభేదాలు సృష్టిస్తూ ముందుకు వెళ్ళలేం... అవార్డులు గురించి ఆంధ్ర తెలంగాణ అంటూ వాదించుకోడం మంచిది కాదు..! ఆ వాదనలో కమ్మ, కాపు, రెడ్డి అంటూ వాదించుకోవడం అనాగరికం! ఏదో టీవీలవాళ్లు రేటింగ్‌కోసం చేస్తున్న అల్లరిని ప్రోత్సహించడం మరీ ఘోరం!
ఈ విధమైన విభేదాలు సృష్టించుకుంటూ వుంటే తెలుగు సిన్మారంగం ముందుకు ఎలావెళ్తుంది...? ఒక తెలుగు సిన్మా తియ్యాలి అంటే... ఇటు తెలుగువాళ్ళు.. అటు తెలంగాణా వాళ్ళు కలిసి తీరాల్సిందే...! కేవలం.. తెలంగాణ తారలతో సిన్మా తీసి... తెలంగాణ థియేటర్లలో సిన్మా రిలీజ్ చెయ్యడం సాధ్యం అవుతుందా? ఇలా వాదించుకుంటూ తెలంగాణ ఫిలిం కూడా తయారు చేస్తారా...?
ఇవాళ మీడియాలో తెలంగాణ వార్తలు... ఆంధ్రా వార్తలు చెబుతున్నారు. దినపత్రికలలో తెలంగాణ వార్తలు.. ఆంధ్రావార్తలు అని ప్రచురిస్తున్నారు..! ఆ విధంగా మనం ముందుకువెళ్తే- తెలంగాణ టీవీలో తెలుగు కార్యక్రమాలు... తెలుగు సిన్మా ప్రకటనలు చూపించకుండా నిషేధం ప్రకటిస్తారా?
ఈ విధమయిన విభేదాలు సృష్టిస్తే.. మొత్తం సిన్మారంగమే నష్టపోతుంది! కమ్మ రామాయణం...కాపు భాగవతం అంటూ సిన్మాలు తీస్తామా? ఆ విధంగా ముందుకువెళ్తే ప్రేక్షకులు సిన్మాలు చూస్తారా...!
తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి.. తెలంగాణలో నిర్మించిన చిత్రాలకు రాయితీలు ఇవ్వవచ్చు! ప్రస్తుతం ఇష్టం వున్నా లేకున్నా.. సినిమా రంగం ఒకటిగా కలిసి వుండక తప్పదు! ప్రస్తుతం జంట నగరాల్లో సిన్మాలు తీసినా... విశాఖలో, విజయవాడలో సిన్మా నిర్మించినా.. తెలుగు సిన్మా తీస్తే.. ఇక్కడా అక్కడా రెండుచోట్లా రిలీజ్ చెయ్యాలి! ప్రజలు చూడాలి! వినోదం పన్ను అంటారా.. అది ఎవరిది వారికే వెళ్తుంది! లేకుంటే ఇద్దరికీ నష్టమే! ఈ సంగతి తెలిసిన పెద్దలు లోగడ చెప్పారు..! ఇప్పుడు చెప్తున్నారు...! హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకువెళ్ళినట్లు... హైదరాబాద్‌లో వున్న సిన్మా రంగాన్ని.. విశాఖపట్నంకు తీసుకువెళ్ళిపోవడం.. ఎంత అసాధ్యమో.. సిన్మారంగాన్ని కులాల వారీగా విడదీసి సినిమాలు నిర్మించడం మరింత అవివేకం. తమిళనాడు మీద తమిళ భాషమీద అక్కడి ప్రజలకు మనకంటే ఎక్కువ ప్రేమ... తమిళ భాష మీద అభిమానం వున్న తమిళనాడు ప్రజల ఆరాధ్యదైవం: యం.జీ.రామచంద్రన్ మళయాళీ నటుడు! నిన్నటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత తెలుగు అమ్మాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎక్కడివాడో మీకు తెలుసు! ఈ విధంగా మనం ఈ కొంచెం ముందుకువెళ్తే... చాలా చిక్కులు వస్తాయి! తమిళ సిన్మారంగంలో తెలుగువాళ్ళు, మలయాళీలు, కర్ణాటకవాళ్ళు అంటూ చాలామంది వున్నారు. ఈ విధంగా తెలుగు సిన్మారంగాన్ని విభజించడం సాధ్యంకాదు. అంచేత సిన్మావాళ్ళు ఎక్కడ వున్న సిన్మావాళ్ళే...!
ఇటూ తెలుగువాళ్ళనీ, తెలంగాణ వాళ్ళనీ, పరిపాలన సౌలభ్యంకోసం విడదీసి... పాలించవచ్చు. కానీ..కళాకారులను మాత్రం విడదీయడం అసాధ్యం. అది జరగని పని.. ఈ సంగతి అందరకీ తెలుసు... కాకపోతే... రాజకీయాలు అనుకున్నప్పుడు ఇలాంటి విభేదాలు సృష్టించడం సర్వసామాన్యం! కాబట్టి కళామతల్లిని ఆరాధించే వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి మాటల మాయలో పడ్డారు. ఈ నిజాన్ని మన కళారంగం సిన్మారంగం మనకు గుర్తుచేస్తూనే వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ విభేదాలు.. ఈ ఉపన్యాసాలు... కాలక్షేపానికే తప్ప, ఎందుకు పనికిరావు..! మంచినీళ్ళలాగ నిర్మలంగా వుండే కళారంగంలో కళాకారులు అందరూ ఒక్కటే..!

- గీతాసుబ్రావ్ 9848034418