గ్లామర్ సీక్రెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంఎల్‌ఏ సినిమా హిట్‌తో హ్యాపీ మూడ్‌లో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన గ్లామర్ సీక్రెట్ గురించి తెలిపింది. ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి నిద్ర, కష్టపడి పనిచేయడం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం.. ఇంతకాలం తాను గ్లామర్‌గా ఉండటానికి ఇదే తారకమంత్రమని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఓ న్యూస్ చానల్ చిట్‌చాట్‌లో కాజల్ తన గ్లామర్ రహస్యంతోపాటు పలు విషయాలపై మాట్లాడింది. శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. టాలీవుడ్, కోలీవుడ్ రెండూ తనకు సొంతిళ్లు వంటివని చెప్పింది. దర్శకులందరితో మంచి సంబంధాలున్నాయని, ఎవరితోనూ ఇబ్బందులు లేవని తెలిపింది. ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి మాట్లాడుతూ- మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటివరకూ ఎవరినైనా ప్రేమించారా? అని అడిగితే ప్రస్తుతానికి నాకు అంత సమయం లేదు అంటూ నవ్వేసింది. ఆమె ఇటీవల నటించిన ఎంఎల్‌ఏ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది.