ఛాన్స్ మిస్సయంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లా మర్ హీరోయిన్‌గా సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ, గత నెల రష్యన్ యువకుడితో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన ఈమెకు, తాజాగా తెలుగులో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే చిత్రంలో హీరోయిన్‌గా శ్రీయను ఎంపిక చేశారట. కానీ శ్రీయకు పెళ్లికావడంతో ఆమె బిజీగా మారిందని, ఇపుడు ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్‌బాబు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఈనెల చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో కన్పిస్తాడట. మరి హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి!