ఇదం జగత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రానికి ఇదం జగత్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిర్ణయించారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజుకురియన్ నాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. టైటిల్‌కు చక్కని స్పందన వస్తోంది. హీరో పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటివరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విధపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కోప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనీల్ శ్రీకంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్.