ఆంధ్రాలో బలపడుతున్న ‘మా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) క్రమంగా బలపడుతోంది. హైదరాబాద్‌లో ‘మా’ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో భారత ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారంగా ‘మా’-ఏపీని అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రార్ ఈ మేరకు హెచ్-196 నంబర్‌తో ‘మా’ ఏపీకు 2018 ఫిబ్రవరి 2న రిజిస్ట్రేషన్ చేశారు. సినీనటి కవిత అధ్యక్షురాలిగా ఉన్న ఈ యూనియన్‌లో ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు, కార్యదర్శులుగా గీతాంజలి, హాస్యనటి శ్రీలక్ష్మి, బాలాజీలతో కమిటీ ఏర్పడింది. ‘మా’ ఏపీ యూనియన్‌కు వ్యవస్థాపకుడుగా కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, పెద రావూరు ఫిలిమ్ స్టూడియో అధినేత దిలీప్ రాజా నేతృత్వంలో కమిటీ ముందుకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 22న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని యూనియన్ సభ్యులు కలిసి ‘మా’ ఏపీ లోగోను ఆవిష్కరింపజేశారు. తాము హైదరాబాద్‌లో వున్న ‘మా’కు వ్యతిరేకం కాదని, అందరం ఒకే సినిమా కుటుంబ సభ్యులమని చెబుతూ కొత్తగా రాష్ట్రం ఏర్పడినందు వలన సినిమాటోగ్రఫీ చట్టం మేరకు నూతన కమిటీ ఏర్పాటైందని ‘మా’ ఏపీ కమిటి స్పష్టం చేసింది. తెనాలిలో ఇటీవల ‘మా’ ఏపీ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ‘మా’ ఏపీ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర సెన్సార్ సభ్యుడు, పెదరావూరు ఫిలిమ్ స్టూడియో అధినేత దిలీప్ రాజా తెలిపారు. ఈ ఆవిర్భావ సభలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని ‘మా’ ఏపీ లోగోను ప్రజలకు చూపించారు. అనంతరం సినీ తారలు కవిత, నరసింహరాజు, గీతాంజలి, శ్రీలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు వేదికపై నృత్యం చేసి అందర్నీ అలరించినట్లు దిలీప్‌రాజా పేర్కొన్నారు.