ఐపిఎల్ బ్రాండ్ ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ అనేది మన రక్తంలో, నరనరాల్లో జీర్ణించుకుపోయి వుందని హీరో ఎన్టీఆర్ అన్నారు. ఆయన ఐపిఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఈ నెల 7 నుండి ప్రారంభంకానుంది. ఈ ఐపిఎల్‌కు తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్‌టిఆర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ- క్రికెట్‌ను ఆస్థిలా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. క్రీడలు ఒక లాంగ్వేజిలాగా కూడా పనికివస్తాయి. క్రీడల ద్వారా ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగల్గుతున్నారు. భారతదేశం క్రీడలపట్ల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తల్లిదండ్రులు ప్రేమను పంచినట్టు క్రికెట్‌ను వారసత్వంగా పంచారని నమ్ముతున్నాను. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్ చూసేవారు. ఆయన చూడడంతో నేను కూడా దానిపట్ల ఆసక్తి పెంచుకున్నాను. అలాగే నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పంచుతా. కేవలం ఒక్క భారతదేశంలో ఇంతగా క్రికెట్‌ను ఆదరించడం జరుగుతోంది. అలాంటి ఒక కొత్త డైమెన్షన్‌ను క్రియేట్ చేసింది ఐపిఎల్. దాన్ని తెలుగు భాషలో కామెంటరీ చేస్తే స్టార్ మా టీలో టెలికాస్ట్ చేయడానికి, నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నందుకు స్టార్ ఇండియావారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.