సూర్య పాటలొచ్చేస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 15న జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చేస్తే రొటీన్‌గా వుంటుందని భావించిన యూనిట్ తిరుపతి లేదా కర్నూలులో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫైనల్‌గా తిరుపతిలోనే జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ ఓ రేంజ్‌లో సంచలనం రేపింది. బిజినెస్ వర్గాల్లోకూడా భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని భారీగా మే 4న విడుదల చేయనున్నారు.