డబ్బుచుట్టూ 4 ఇడియెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, సందీప్, చలం, సన్నీ హీరోలుగా ప్రియా, అగస్టీన్, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరంగం సతీష్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందే 4 ఇడియెట్స్ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్ కొట్టగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శక నిర్మాత సతీష్‌కుమార్ మాట్లాడుతూ-లవ్, యాక్షన్, డ్రామా ఎంటర్‌టైన్ వేలో చిన్న సందేశాన్ని అందిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్తవాళ్ళు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతుండగా, జబర్దస్త్ బ్యాచ్ నటిస్తోంది. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి జూన్ వరకు జరిగే మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేస్తాం. డబ్బుకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నలుగురు కుర్రాళ్లు ప్రేమించిన అమ్మాయిలను సైతం వదిలిపెట్టి డబ్బు చుట్టూ తిరుగుతుంటారు. ఆ తరువాత వారి జీవితాలు ఎలా మారాయి అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకునికి కృతజ్ఞతలు తెలిపారు నటీనటులు. ఈ చిత్రానికి కెమెరా:నాగేశ్ యర్రవరపు, సంగీతం:జయసూర్య, పాటలు:శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం:శ్రీరంగం సతీష్ కుమార్.