సీనియర్ నటుడు చంద్రవౌళి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రవౌళి గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రవౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గరలోని మునగాలపాలెం. ప్రముఖ నటుడు మోహన్ బాబు తండ్రి చంద్రవౌళికి గురువు. 1971లో చిత్రరంగంలోకి ప్రవేశించిన ఆయన 45 ఏళ్లకుపైగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. 1971లో ‘అంతా మనమంచికే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన కృష్ణ, శోభన్‌బాబు, నాగేశ్వరరావు వంటి అగ్రనటుల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించారు.