అఖిల్ సరసన మేఘ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటిస్తున్న మూడవ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన ‘హలో’ ఫర్వాలేదనిపించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో ఓ మంచి లవ్‌స్టోరీని ఎంపిక చేసుకుని వస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన కొత్త హీరోయిన్ కాకుండా క్రేజ్ వున్న హీరోయిన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్ల పేర్లు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా అఖిల్ సరసన మేఘా ఆకాష్ నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నితిన్ ‘లై’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మేఘా ప్రస్తుతం నితిన్‌తో చల్‌మోహన్‌రంగ చిత్రంలో నటిస్తోంది.