పాటల రికార్డింగ్‌లో తథాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ తేజ్, సంతోష్, ప్రియ, వర్షిణి హీరో హీరోయిన్లుగా తోట నాగేశ్వర దర్శకత్వంలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై తోట నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘తథాస్తు’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత తోట నాగేశ్వరరావు వివరాలు తెలియజేస్తూ- గత 30 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నాను. 16 మెగా సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. ఈ చిత్రం ద్వారా నా మేనల్లుడు అర్జున్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాను. ఇద్దరు యువతీ యువకుల మధ్య వుండే మానసిక బంధంతోపాటు కాలం వారి జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వినూత్నమైన కథ ఇది. అలాగే సుమన్, భానుచందర్, శివాజీరాజా లాంటి ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. తప్పకుండా నా ప్రయత్నం మంచి విజయం సాధిస్తుంది అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నటి కవిత మాట్లాడుతూ- టైటిల్ చాలా సంప్రదాయబద్ధంగా వుంది. నాగేశ్వరరావు చాలాకాలంగా తెలుసు. ఇందులో నేను తల్లి పాత్రలో కన్పిస్తున్నాను.