పాటల్లో కొత్త కుర్రోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజానాయుడు దర్శకత్వంలో లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై పదిలం లచ్చన్నదొర నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. సాయి యేలేందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో బుధవారం విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టైటిల్ బాగుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు తన కూతురు శ్రీప్రియను హీరోయిన్‌గా పరిచయం చేయడం అభినందనీయం. హీరో హీరోయిన్లు ఇద్దరూ అద్భుతంగా నటించారు. మంచి కంటెంట్ వుంటే తప్పకుండా సినిమాలు విజయం సాధిస్తాయి అన్నారు. బసిరెడ్డి మాట్లాడుతూ- యేలేందర్ అందించిన సంగీతం బాగుంది. దర్శకుడు రాజా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ యూనిట్‌కు నా శుభకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. నిర్మాత లచ్చన్నదొర మాట్లాడుతూ- అనుకున్న ప్రణాళిక ప్రకారం దర్శకుడు చక్కగా తీశాడు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు రాజా నాయుడు మాట్లాడుతూ- అందరి సహకారం వల్లే అనుకున్న విధంగా పూర్తిచేశాం. నిర్మాత ఎంతో సపోర్టు అందించారు. కెమెరా, మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, శ్రీరామ్, శ్రీప్రియ తదితరులు పాల్గొన్నారు.